బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం పాలసి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం పాలసి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కవిత బెయిల్ కేసు విచారణలో న్యాయమూర్తులు కీలక అంశలపై మాట్లాడారు. ముఖ్యంగా కేసులో ఉన్న నిందితులను అప్రూవర్స్ గా పరిగణించడాన్ని న్యాయమూర్తులు తప్పుపట్టారు. అంతే కాకుండా ఈడీ & సీబీఐ కేసు విచారణలో చేస్తున్న జాప్యాన్ని, అంతే కాకుండా ఇన్ని రోజుల నుంచి విచారణ జరిగినా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోర్టు ముందు తేలేకపోవడాన్ని విమర్శించారు.
కేవలం ఫోన్ ఫార్మాట్ చేసిందనేది నేరం రుజువు చేయడానికి సరిపోయే ఆధారం కాదని సూచన చేయడమే కాకుండా, ఇంకేవైనా ఇతర ఆధారాలు ఉన్నాయా అని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నకు ఏజెన్సీల వద్ద నుంచి సమాధానం రాలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు సెక్షన్ 45(1) పీఎంఎల్‌ఏ చట్ట కింద కవితకు బెయిల్ ఇవ్వకుండా చెప్పిన కారణాలను గుర్తు చేస్తూ.. వాటిని తప్పు పట్టడమే కాకుండా, హైకోర్టును సుప్రీం కోర్టు బెంచ్ మందలించింది. ఈ చట్టం కింద మహిళ యొక్క స్టేటస్ చూడకుండా బెయిల్ ఇవ్వాల్సిందే అని న్యాయమూర్తులు కోర్టుకు తెలిపారు.