బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం పాలసి కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజారు చేయడంతో మరికాసేపట్లో ఆమె తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం పాలసి కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజారు చేయడంతో మరికాసేపట్లో ఆమె తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇప్పటీకే కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తీహార్ జైలుకు చేరుకున్నారు. కవిత జైలు నుంచి విడుదల తర్వాత మీడియాతో మాట్లాడానున్నారు. ఢిల్లీ మద్యం పాలసి కేసులో కవిత దాదాపు నాలుగు నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో కవితను ఈ ఏడాది మార్చి 25న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏఫ్రిల్ 11న సీబీఐ కూడా కవితను అదుపులోకి తీసుకొని తీహార్ జైలుకు తరలించారు.