ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. దీంతో డీఎస్సీ అభ్యర్థులు ఆందోలనాలను మరింత ఉదృతం చేశారు. TGSPSC, విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. కాగా, ఆందోలనలు తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. దీంతో సోమవారం రాత్రి కూడా నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున అక్కడికి వెళ్లిన డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నఅభ్యర్థుల వెంటపడి పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను BRSV నాయకులు దహనం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరుద్యోగులు గత కొంత కాలంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు పెంచాలని నిరసనలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న డీఎస్సీని రద్దు చేసి 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆందోళనలు చేపట్టారు.
అయితే, ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. దీంతో డీఎస్సీ అభ్యర్థులు ఆందోలనాలను మరింత ఉదృతం చేశారు. TGSPSC, విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. కాగా, ఆందోలనలు తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. దీంతో సోమవారం రాత్రి కూడా నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున అక్కడికి వెళ్లిన డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నఅభ్యర్థుల వెంటపడి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలోనే BRSV నాయకులు కడారి స్వామి, తుంగ బాలు, జంగయ్యతో పాటు కార్యకర్తలు అక్కడికి చేరుకొని యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చమంటున్న అభ్యర్థులను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉదయం నుండే అక్కడ ఉన్న పోలీసులు.. BRSV నాయకులను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్వీ నాయకులు. అరెస్ట్ చేసిన పోలీసులు. pic.twitter.com/ENVXtu5RSl — News Line Telugu (@NewsLineTelugu) July 9, 2024