ఈ మేరకు మొబైల్, మొబైల్ యాక్ససరీస్‌పై 15 శాతం డ్యూటీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే పలు ఆర్థిక లోటును తగ్గించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆర్ధిక లోటు 4.9 శాతంగా ఉందని వెల్లడించారు.
ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే మరో 3 మందులకు కస్టమ్ డ్యూటీ మినహాయింపు ఉండనున్నట్లు తెలిపారు. దీంతో క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌తో పాటు దానికి సంబంధించిన మెడిసిన్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇండియాలోనే తయారు చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించేందుకు ప్రోత్సహించడానికి కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు మొబైల్, మొబైల్ యాక్ససరీస్‌పై 15 శాతం డ్యూటీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
ఇక బంగారం వంటి ఖనిజాలను దిగుమతి చేసుకునే వారికి కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు రకాల ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే బంగారం, వెండిపై 6శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గే అవకాశం ఉంది.
ఈ-కామర్స్ సంస్థలకు కూడా టీడీఎస్ తగ్గిస్తూ ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ ధరలు తగ్గనున్నాయి. స్టార్టప్స్‌పై ఏంజల్ ట్యాక్స్ రద్దు చేస్తామని, దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను విధిస్తామన్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని వీలనైంత వరకు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్లాస్టిక్‌పై కస్టమ్ డ్యూటీ పెంచినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు కొత్త పన్ను విధానంలో కేంద్రం పలు కీలక మార్పులు తీసుకొని వచ్చినట్లు తెలుస్తోంది. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా, రూ.3-7 లక్షల వరకు 5 శాతం ట్యాక్స్ విధించనున్నట్లు ఆమె తెలిపారు. కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా అవుతుందని అన్నారు.