శ్రావణమాసం దెబ్బకు ఢమాల్ అన్నాయి. ఇదే నెలలో పెళ్లిలు, శుభాకార్యాలు భారీగానే ఉన్నప్పటికీ చికెన్ ధరలు మాత్రం భారీగా పడిపోయాయి.
న్యూస్ లైన్ డెస్క్ : కొన్ని నెలల క్రితం కొండ మీదున్న చికెన్ ధరలు నేలకు దిగొస్తున్నాయి. శ్రావణమాసం కంటే ముందు కిలో చికెన్ రూ.300 నుంచి ఆ పైన పలికిన చికెన్ ధర.. శ్రావణమాసం దెబ్బకు ఢమాల్ అన్నాయి. ఇదే నెలలో పెళ్లిలు, శుభాకార్యాలు భారీగానే ఉన్నప్పటికీ చికెన్ ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. ఇదే నెలలో పెళ్లిలు, శుభకార్యాలతో పాటు.. వ్రతాలు, పూజలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మహిళామణులు శ్రావణమాసంలో చికెన్ వాసనను కిచెన్ లోకి అడుగు కూడా పెట్టనివ్వరు. ఆ దెబ్బకు చికెన్ ధర పడిపోయి బిక్కమొహం వేసింది.
ఈ నెల మొదటివారంలో రూ.280 నుంచి 300 వరకు పలికిన చికెన్ ధర ఆగష్టు 15 నాటికి రూ.150కి పడిపోయింది. అంటే.. పది రోజుల్లోనే సగానికి సగం తగ్గింది. వీకెండ్, ఆదివారాల్లో గిరాకీ ఉండే రోజుల్లో కూడా చికెన్ ధర నేలచూపులే చూసింది. ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధర కిలోకి.. రూ.150 దగ్గర ఉంది.