life style: చిట్టి చిలకమ్మ..అమ్మకొట్టిందా పాటను రాసింది ఎవరో తెలుసా ?

ప్రతి ఇంటి వారికి ఈ చిలకమ్మ పలుకులు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఎప్పుడైనా  ఈ పాట ఎవరు రాసి ఉంటారనేది ఆలోచించారా.


Published Aug 30, 2024 05:11:00 PM
postImages/2024-08-30/1725018305_sddefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: "చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా... తోటకెళ్లావా పండు తెచ్చావా" ఈ పాట తెలియని తెలుగు వాడు లేడేమో..జానీ జానీ ఎస్ పాపా...ఈటింగ్ షుగర్ నో పాపా...ఇలా ఇంగ్లీష్ మాటలు నేర్పే వారికి కూడా ఈ చిట్టి చిలకమ్మ ముచ్చట్లు తెలిసిందే. అసలు చిన్న పిల్లలు ఉన్నా...లేకున్నా ప్రతి ఇంటి వారికి ఈ చిలకమ్మ పలుకులు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఎప్పుడైనా  ఈ పాట ఎవరు రాసి ఉంటారనేది ఆలోచించారా.


ఈ పాట రాసింది ..బల్ల సరస్వతి ఒక స్కూల్ టీచర్. ఆమె రాసిన ఆత్మకథ కలెనేత (ఏడు తరాల తలపోత). తెలుగులో ఆత్మకథలు రాసిన వారిలో బల్లసరస్వతి ఒకరు. ఇలా తన తాత ముత్తాతలతో మొదలుపెట్టిన ఆనవాయితీని ...కొన్నాళ్లుగా కొన్నేళ్లుగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పుట్టుక చావుల మధ్య జరిగిన బ్రతుకు పోరాటమే ఈ కలెనేత.తను పుట్టక ముందు తన ముత్తాతతో మొదలెట్టిన రచన, తాత, తండ్రి, తను,కూతుర్లు కొడుకులు, మనమరాండ్లు, మునిమనవరాలితో ఆగింది.ఇలా ఏడు తరాల తలపోతను తన ఆత్మకథలో పొందుపరిచారు.


ఇప్పుడు  మార్కట్లో ఈ పుస్తకం బాగానే వెళ్తుంది. జనాలు కూడా తిరిగి పుస్తకాలకు అలవాటుపడుతున్నారు. అంతే కాదు..చిట్టిచిలకమ్మను చాలా చిన్నతనం నుంచి వింటున్నాం..ఎవరో రాసిన పాటను ఇలా అప్ డేట్ చేశారేమో అంటున్నారు నెటిజన్లు. లేదు లేదు ఆత్మకథలో వారే చెప్పారంటున్నారు మరికొందరు . ఏదది ఏమైనా ..చిట్టిచిలకమ్మ రాసింది మన తెలంగాణ ఆడపడుచు అది ఆనందం అంటున్నారు మరికొంతమంది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style kids telugu

Related Articles