Harish Rao: సీఎం హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారు

 సీఎం హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.


Published Jul 24, 2024 06:36:36 AM
postImages/2024-07-24/1721808905_modi53.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం అసెంబ్లీ నుండి వాక్ ఔట్ చేసిన ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని అన్నారు. సభలో సభ్యులందరికి మాట్లాడే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్టీసీ యూనియన్‌ను పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదని హరీష్ రావు విమర్శించారు. ఆయనకు ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. తాను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశానని అన్నారు. 

ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని అన్నారు. ఊసరవెల్లి సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని 
హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. 
 
రాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని, నిరుద్యోగులపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం తమకు ఇవ్వడం లేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news newslinetelugu telanganam congress-government telanganaassembly brswalkout

Related Articles