Police: సీఎం నియోజకవర్గంలో రెచ్చిపోయిన పోలీసులు

ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి సొంత నియోజకవర్గం అచ్చంపేటలో  పోలీసులు రెచ్చిపోయారు


Published Jul 30, 2024 05:11:43 AM
postImages/2024-07-30/1722334292_cmfarmer.PNG

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి సొంత నియోజకవర్గం అచ్చంపేటలో  పోలీసులు రెచ్చిపోయారు. ఓ పొలం కేసులో  పోలీసులు జోక్యం చేసుకోగా.. రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. వంగూరు మండలం ఉల్పర గ్రామానికి చెందిన క్యామ వెంకటేశ్వర్లును పొలం గొడవల్లో పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ఉన్న పొలం కాకుండా తన సొంత పొలాన్ని చదును చేస్తుండగా వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు వంగూరు ఎస్ఐ బలవంతంగా తీసుకెళ్లి కొట్టాడు. అయితే వెంకటేశ్వర్లు కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తన అన్న, అల్లుడు, కుమారుడిపై  పోలీసులు బైండోవర్ కేసు పెట్టారు.

ఆ తర్వాత కోర్టులో ఉన్న భూమిని దున్నిన ప్రత్యర్ధి మనిషి ఏ. సుజీవన్ రెడ్డి. దీనిపై వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయగా ఎస్ఐ పట్టించుకోలేదు. ప్రత్యర్థులకు కొమ్ముకాస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు సీఐకి ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల తీరుతో రైతు వెంకటేశ్వర్లు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు రైతు వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana congress police cm-revanth-reddy farmer

Related Articles