Congress: ప్రశ్నించే గొంతుకలను వేధిస్తున్న కాంగ్రెస్

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులతో వేధిస్తుంది.


Published Sep 09, 2024 05:02:41 PM
postImages/2024-09-09/1725881561_fakecong.PNG

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులతో వేధిస్తుంది. పొద్దున లేస్తే తమది ప్రజాపాలన అని ఊదరగొట్టే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి మాత్రం తెలంగాణలో ప్రతీకార పాలన సాగిస్తుందని.. నియంతృత్వ పోకడలతో, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని పలువురు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు చేసే వాళ్లపై కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను సీఎం రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. కేసులు, నోటీసుల పేరుతో వేధిస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ స్టేటస్ పెట్టినా.. గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో ప్రజా సమస్యల గురించి కాంగ్రెస్‌ని విమర్శిస్తూ ఏదైనా మెసేజ్ పెట్టినా కూడా రేవంత్ ప్రభుత్వం భరించలేకపోతుందని గత 9 నెలల్లో జరిగిన సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించి ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ మీద ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. వాస్తవానికి సీఎం రేవంత్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సర్క్యూలర్ ఫేక్ అని క్రిశాంక్ ఎత్తిచూపారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిశాంక్‌పై ఇప్పటికే సుమారు 10 కేసులు నమోదయ్యాయి. వారు చేసే విమర్శల్లో ఎటువంటి అసభ్యకరమైన పదజాలం, మార్ఫింగ్‌లు లేకపోయినప్పటికీ కేవలం కాంగ్రెస్ చేస్తున్న తప్పులు ఎత్తిచూపుతున్నారనే అక్కసుతో పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : india-people brs cm-revanth-reddy congress-government social-media

Related Articles