Congress : వీహెచ్ ని సిల్లీ అంటూ కాంగ్రెస్ పోస్ట్.. సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా?


Published Aug 29, 2024 07:21:12 PM
postImages/2024-08-29/1724939472_VHanmanthrao.jpg

న్యూస్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు నిత్యం అవమానాలే అనేమాట మరోసారి నిజమైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సీనియర్లకు అసలు మర్యాద అనేదే లేకుండా పోయిందని పలుసార్లు కాంగ్రెస్ సీనియర్లు బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే. పొన్నాల లక్షయ్య లాంటి సీనియర్ నేతలను చచ్చే ముందు ఏం తక్కువైందంటూ కామెంట్లు చేసిన రేవంత్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన వీ.హనుమంతరావును ఉద్దేశించి పార్టీ అధికారిక ఖాతాలో చేసిన పోస్ట్ ఆయనను అవమానించినట్టుగా ఉంది.

ఆపన్న హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న ఎక్స్ ఖాతాలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ఊదరగొట్టే ప్రచారాలకు సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. అయితే.. ఒక ఇంగ్లీష్ పాటకు కాంగ్రెస్ మంత్రులు, నేతల ఫొటోలు జతపరుస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. పాట లిరిక్స్ లో ఫన్ అండ్ సిల్లీ అనే పదాలు వచ్చే దగ్గర పార్టీ సీనియర్ నేత, ఉన్నదున్నట్టు మొఖం మీద చెప్పేసే నాయకుడు వీ.హనుమంతరావు ఫొటో వాడుతూ ఆయనను కించపరుస్తున్నట్టుగా వీడియో చేశారు. అదే నిన్నగాక మొన్న పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి టైగర్ అంటూ.. గొప్పగా డప్పు కొడుతూ ఎడిటింగ్ చేశారు. ఇది చూసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, పార్టీ డైహార్డ్ అభిమానులు నొచ్చుకుంటున్నారు. పార్టీలో సీనియర్లకు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy tspolitics congress congress-government latest-news news-updates

Related Articles