ఖచ్చితంగా క్రికెట్ ను అందరు పిల్లలు నేర్చుకోవల్సిందే.మన దేశంలో కాదు ఆస్ట్రేలియాలోని ఒక స్కూల్ లో ఈ పధ్ధతి మొదలుపెట్టారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో గేమ్స్ ఉండడం చాలా కామన్. పాఠ్యపుస్తకాల్లో ఒక లెసన్ గా ఉంటుంది.కానీ క్రికెట్ ను ఏకంగా ఓ సబ్జెక్ట్ గా తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఇష్ట ఉన్నవాళ్లు నేర్చుకోవచ్చు. ఇష్టం లేనవాళ్లు లైట్ తీసుకోవచ్చు. కాని ఇక పై అలా కుదరదు. ఖచ్చితంగా క్రికెట్ ను అందరు పిల్లలు నేర్చుకోవల్సిందే.మన దేశంలో కాదు ఆస్ట్రేలియాలోని ఒక స్కూల్ లో ఈ పధ్ధతి మొదలుపెట్టారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఘనత ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లకు దక్కుతుంది. 1877లో ఈ రెండు జట్లు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాయి. అయితే.. 2027తో ఈ రెండు జట్లు తొలి టెస్ట్ ఆడి 150 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాయి. ఈ 150 ఏళ్లలో ఆస్ట్రేలియా క్రికెట్ ఎంతో ఎదిగింది. ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా మంచి టీం. ఇది కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడున్న పిల్లలకి క్రికెట్ గురించి తెలియాలనే ఇలా చేసిందట.
6 వన్డే వరల్డ్ కప్‌లు, ఒక టీ20 వరల్డ్ కప్, ఒక డబ్య్లూటీసీ కప్‌ను సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మోస్త్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉంది. క్రికెట్‌ను ఒక ఫార్మాల్ సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టి.. 9, 10వ తరగతి విద్యార్థులకు మ్యాచ్‌లు కూడా నిర్వహించనున్నారు. ఇవి పరీక్షల్లాగా...మంచి స్కోర్ ఉన్నవారిని టీంలో కాస్త పుష్ చేస్తారు. క్రికెట్ లో జస్ట్ బ్యాటింగ్ ఒక్కటే కాదు .. అంపైరింగ్, కోచింగ్, ఆటగాళ్లకు ఫస్ట్ ఎయిడ్ చేయడం ఇలా క్రికెట్‌కు సంబంధించిన అన్ని అంశాలు ఆ సబ్జెక్ట్‌లో ఉంటాయి. మొదలుపెట్టడం సరే...చివరికి ఏం జరుగుతుంది. కొత్త వారు దొరుకుతారా..శుభం లేదంటే ప్రభుత్వానికి అదనపు ఖర్చు తప్పదు.