ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. లండన్ స్టాక్ మార్కెట్లతో పాటు అనేక సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంలో మాన్యువల్ చెక్-ఇన్ అమలు చేశారు. బెంగళూరులోని విమానాశ్రయంలో కూడా సేవలకు అంతరాయం కలిగింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టులలో విమానాల రాకపోకలు కూడా ఆలస్యం అవుతున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్:
ప్రపంచవ్యాప్తంగా ఫ్లైట్, బ్యాంకింగ్ సేవలకు ఒక్కసారిగా అంతరాయం కలిగింది. అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేకదేశాల్లో మాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఆ సేవలు నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా ఉన్న మీడియా, విమాన, టెలికాం, బ్యాంకింగ్ వంటి సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నంబర్ 911 పై ప్రభావం పడింది. లండన్ స్టాక్ మార్కెట్లతో పాటు అనేక సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంలో మాన్యువల్ చెక్-ఇన్ అమలు చేశారు. బెంగళూరులోని విమానాశ్రయంలో కూడా సేవలకు అంతరాయం కలిగింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టులలో విమానాల రాకపోకలు కూడా ఆలస్యం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలగడంతో.. కొన్ని పీసీల్లో విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సమస్య వచ్చింది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి.
అయితే, సర్వీస్ ప్రొవైడర్‌తో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. సాంకేతిక సమస్య రావడం కారణంగానే విమాన, బ్యాంకింగ్ వంటి అనేక సేవలకు అంతరాయం మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. సర్వర్‌ను సరిచేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అంతరాయం ఏర్పడినందుకు చింతిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. మరోవైపు కొంత సమయం వరకు తమ సర్వీసులు అందుబాటులో ఉండే అవకాశం లేదని పలు ఎయిర్ పోర్టులు, ఇతర బ్యాంకింగ్ సంస్థలు తెలిపాయి.