Mobile:ఫోన్ వాడే ప్రతి ఒక్కరు ఈ 3నెంబర్లు తప్పక గుర్తుంచుకోండి లేదంటే కష్టమే.?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. ఓ పూట అన్నం లేకుండా ఉంటారు కానీ మొబైల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఆ విధంగా మొబైల్ ఫోన్ కు ఎడక్ట్


Published Aug 24, 2024 01:45:00 PM
postImages/2024-08-24/1724485418_phone.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. ఓ పూట అన్నం లేకుండా ఉంటారు కానీ మొబైల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఆ విధంగా మొబైల్ ఫోన్ కు ఎడక్ట్ అయ్యారు. అలా మొబైల్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు ఈ మూడు నెంబర్లను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిందే. లేదంటే నష్టం తప్పదు అని టెక్ నిపుణులు అంటున్నారు. మరి ఆ నెంబర్లు ఏంటి ఆ వివరాలు చూద్దాం..

ఇందులో మూడవ నెంబర్ అయితే మీరు ఫోన్ పోగొట్టుకున్నా కానీ మళ్లీ కనిపెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో మొదటగా తెలుసుకోవాల్సిన నెంబర్ *#61# ఈ నెంబర్ మీ మొబైల్ లో డయల్ చేస్తే  మీ ఫోన్ కు వచ్చే కాల్స్, మెసేజెస్ ఎవరికైనా ఫార్వర్డ్ అవుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కాల్ ఫార్వార్డింగ్ వల్లనే చాలా స్కాములు జరుగుతున్నాయి.

ఇందులో రెండవ నెంబర్ ##002# నెంబర్ కు డయల్ చేసి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యుంటే వెంటనే డిఆక్టివేట్ చేసేయండి. ఇందులో మూడవ నెంబర్ విషయానికి వస్తే *#06# డయల్ చేస్తే మీ మొబైల్ యొక్క ఐఎంఈఐ నెంబర్ చూపిస్తుంది. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీలో ఇంకో వ్యక్తులకు పంపించండి. ఒకవేళ మీ మొబైల్ పోగొట్టుకున్న,  ఎవరైనా దొంగిలించిన ఈ నెంబర్ ద్వారా మీ ఫోన్ ఎక్కడుందో  ట్రేస్ చేసి పట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూడు నెంబర్ల  గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని టెక్  నిపుణులు తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line safety-pin mobile-phone super-features imei-number forwading

Related Articles