Telangana: వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

సాగు చేసుకుంటున్న భూమిలోకి తనను రానివ్వడం లేదని ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. మంచిర్యాల జిల్లా పోలంపల్లిలోని సర్వే నం.384లో శ్రీరాములు అనే రైతు గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన భూమిలోకి అటవీశాఖ అధికారులు రానివ్వకపోవడంతో శ్రీరాములు తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో గురువారం ఉదయం వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం ఆత్మహత్యాయత్నం చేశాడు. 


Published Jul 04, 2024 01:38:23 AM
postImages/2024-07-04/1720075052_modi20.jpg

న్యూస్ లైన్ డెస్క్: రైతుల పట్ల అధికారులు విచక్షణారహితంగా నడుచుకుంటున్న ఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. ఎన్నో ఇల్లుగా తాను సాగు చేసుకుంటున్న భూమిని అటవీశాఖ అధికారులు లాగేసుకుంటున్నారని నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల పరిధి బంగారికుంటతండాకు చెందిన ఓ రైతు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

అయితే, సాగు చేసుకుంటున్న భూమిలోకి తనను రానివ్వడం లేదని ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. మంచిర్యాల జిల్లా పోలంపల్లిలోని సర్వే నం.384లో శ్రీరాములు అనే రైతు గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన భూమిలోకి అటవీశాఖ అధికారులు రానివ్వకపోవడంతో శ్రీరాములు తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో గురువారం ఉదయం వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం ఆత్మహత్యాయత్నం చేశాడు. 

అతన్ని గమనించిన గ్రామస్థులు.. అధికారాలకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బందిఅక్కడికి వెళ్లి శ్రీరాములుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో శ్రీరాములు కిందకు దిగాడు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam farmer suicide-attempt-

Related Articles