బంగారం, వెండిపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిన విషయం తెలిసిందే. దీని ప్రభావం బంగారంపై చాలా త్వరగానే పడిందని చెప్పొచ్చు.
న్యూస్ లైన్ డెస్క్: దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి కారణం కేంద్ర బడ్జెట్ అని చర్చ జరుగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం రూ. 48,21,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఇందులో భాగంగానే పలు ఆర్థిక లోటును తగ్గించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆర్ధిక లోటు 4.9 శాతంగా ఉందని వెల్లడించారు. ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పలు గూడ్స్‌కి కస్టమ్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీని ద్వారా విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.
బంగారం వంటి ఖనిజాలను దిగుమతి చేసుకునే వారికి కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు రకాల ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గించింది. ఇందులో భాగంగానే బంగారం, వెండిపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిన విషయం తెలిసిందే. దీని ప్రభావం బంగారంపై చాలా త్వరగానే పడిందని చెప్పొచ్చు. బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కసారిగా పది గ్రాములపై రూ.3 వేల వరకు పడిపోయింది. ప్రస్తుతం ది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.70,086 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,495 ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వెండి ధర కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి ధరకు ప్రస్తుతం రూ.88 వేలు ఉంది.