కొంత మంది విద్యార్థుల ఆకలిని చంపుకోలేక కారంతోనే భోజనం చేస్తుంటే.. మరికొందరు విద్యార్థులేమో పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో తమకు సరైన ఆహారాన్ని అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దీనావస్థకు చేరిందనడానికి దీనికి కాన్నా పెద్ద నిదర్శనం మరొకటి ఉండదేమో..! ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గొడ్డు కారం పెడుతున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో గత BRS ప్రభుత్వం ఆరోగ్యకరమైన ఆహారంతో కూడిన మెనూ ఇచ్చింది. అంతేకాకుండా, విద్యార్థులకు సన్న బియ్యం అన్నాన్ని కూడా అందించేలా చర్యలు తీసుకుంది.
కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ విద్యాశాఖ మంత్రి కూడా లేకుండా పోయేసరికి ఇప్పటికే పలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు గాడి తప్పాయి. దీంతో గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ఇక, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పరిధిలోని కొత్తపల్లి పాఠశాలలో ఈ ప్రభుత్వ నిర్వాకం బయటపడింది. పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గొడ్డు కారం పెడుతున్నారు. కొంత మంది విద్యార్థుల ఆకలిని చంపుకోలేక కారంతోనే భోజనం చేస్తుంటే.. మరికొందరు విద్యార్థులేమో పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో తమకు సరైన ఆహారాన్ని అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.
మరోవైపు, పాఠశాలలో గొడ్డు కారంతో అన్నం పెట్టడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడిపై మండిపడి, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు కావాల్సిన కనీస పౌష్ఠిక ఆహారాన్ని కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.