ఒక చేతిలో రుద్రాక్ష మరో చేతిలో తాళపత్ర గ్రంధాలు , మరో రెండు చేతుల మధ్య వీణను వాయిస్తున్నట్లు అమ్మవారు దర్శనమిస్తారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మరో ఆరు రోజుల్లో అతి విశిష్టమైన సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కారాలను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రూ.35 కోట్లతో అధునాతన నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. జ్ఞాన సరస్వతీ ఘాట్ నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. మెట్లపై గ్రానైట్, సుందరీకరణ పనులకు సమయం తక్కువగా ఉంది. 3 రంగులతో ముస్తాబు చేయనున్నారు. ఈ ఘాట్ పొడవు మొత్తం 86 మీటర్ల మేర ఉంది.
తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో తయారు చేసి తీసుకురాగా, బుధవారం స్థిర ప్రతిష్ఠ చేశారు.24 టన్నుల బరువు ,10 అడుగుల ఎత్తులో ఉన్న సరస్వతీ దేవి విగ్రహం ఒక చేతిలో రుద్రాక్ష మరో చేతిలో తాళపత్ర గ్రంధాలు , మరో రెండు చేతుల మధ్య వీణను వాయిస్తున్నట్లు అమ్మవారు దర్శనమిస్తారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.సరస్వతీ విగ్రహం, జ్ఞాన దీపం మధ్య 7 హారతుల వేదికలు పూర్తయ్యాయి. కాశీ నుంచి ఏడుగురు పండితులు ఒకేసారి హారతి నిర్వహించే విధంగా ఏర్పాట్లను చేశారు.పుష్కరాలను మెదక్ రంగంపేట పీఠాధిపతులు మదనానంద స్వామి 15న ఉదయం విశేష పూజలతో ప్రారంభించనున్నారు.