స్కాల్ప్ మీద నీరు తగలగానే ...మెత్తని డస్ట్ తో పాటు షాంపూ వల్ల మీ తలపై ఏర్పడిన పొడిబారిన పొడి సరిగ్గా కడుక్కోరు అదే చుండ్రుగా మారి చాలా ఇబ్బందిపెడుతుంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రస్తుతం చుండ్రు సమస్య అనేది కామన్ . చలికాలంలో ఇంకా స్కల్ప్ డ్రై అయిపోతుంది. అంతేకాదు చాలా మంది తల స్నానం చేసేటపుడు తక్కువ నీళ్లతో ఫటాఫట్ తలస్నానం చేసేస్తుంటారు. షాంపూ నురగ పోతే చాలు అనుకుంటారు. కాని స్కాల్ప్ మీద నీరు తగలగానే ...మెత్తని డస్ట్ తో పాటు షాంపూ వల్ల మీ తలపై ఏర్పడిన పొడిబారిన పొడి సరిగ్గా కడుక్కోరు అదే చుండ్రుగా మారి చాలా ఇబ్బందిపెడుతుంది. కొన్నాళ్లకు కుదుళ్లను బలహీనం చేసి జుట్టు రాలిపోయేలా చేస్తుంది. చుండ్రు తగ్గడానికి బెస్ట్ హెయిర్ ప్యాక్స్ తెలుసుకుందాం.
* మందార ఆకులు, పువ్వుల్లో ఉండే గుణాలు జుట్టు సమస్యల్ని, ముఖ్యంగా చుండ్రును తగ్గించడంలో దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. మందార ఆకులపొడి, మందారం పువ్వులు ఎండబెట్టి వాటిని మెత్తని పొడి చేసి పెట్టుకొండి. ఈ రెండింటిని పెరుగుతో కలిపి మెత్తగా పేస్ట్ లా చేసుకొండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లని పట్టించండి.
*ఉసిరి , వేపాకు , కరివేపాకు కూడా మంచి మెడిసిన్ . ఈ పొడులు మీ దగ్గర ఉంటే కాసింత పెరుగులో కలిపి జుట్టుకు అప్లై చెయ్యండి.
* జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌స్పూన్ల పెరుగు, ఒక్కో టేబుల్‌స్పూన్ చొప్పున ఆలివ్ నూనె, వెనిగర్, మెంతిపొడిని వేసి బాగా కలుపుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇది కూడా బెస్ట్ ఆప్షన్.
* స్కల్ప్ డ్రై అయిపోవడంతో పాటు ...మోతాదుకు మించిన షాంపూ కూడా చుండ్రుకు కారణం అవుతుంది. కాబట్టి తలస్నానం చక్కగా చెయ్యండి.