Harish rao: హైడ్రా కాదు.. టార్గెట్ BRS

పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా అక్రమ కేసులు పెడుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారని తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారని ఆయన అన్నారు. మానసికంగా.. పొలిటికల్‌గా.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 


Published Aug 25, 2024 01:24:10 PM
postImages/2024-08-25/1724572450_harishraorespondsonhydra.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైడ్రా పేరుతో రాజకీయ కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హైడ్రా అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం  డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆయన ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం రేవంత్ రెడ్డికి బాగా అలవాటు అయిందని ఆయన అన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని పని చేస్తోందని అన్నారు. 

కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. లేకపోతే ఇబ్బంది పెడతాం అన్నట్లు రేవంత్ తీరు ఉందని ఆయన అన్నారు. పటాన్‌చెరువు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారు.. రూ. 300 కోట్ల ఫైన్ వేసి నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పారు. వెంటనే మైనింగ్ కేసు అటకెక్కిందని హరీష్ రావు అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా అక్రమ కేసులు పెడుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారని తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారని ఆయన అన్నారు. మానసికంగా.. పొలిటికల్‌గా.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పల్లా నిర్మించిన కాలేజీ హెచ్ఎండీఏ పర్మిషన్ ఉందని ఆయన అన్నారు. పల్లాపై కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర మాత్రమే అని అన్నారు. అధికారం ఉందని రాత్రికిరాత్రే బుల్డోజింగ్ పద్ధతి చేయటం సరికాదని హరీష్ రావు అన్నారు. అధికారులు అత్యుత్సాహానికి పోవద్దని.. అన్నీ పరిశీలించాలని హరీష్ రావు సూచించారు. రాజకీయ కక్షలను విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రుద్దొద్దని అన్నారు. మీడియా సమక్షంలో జలాశయాల స్థలాలను కొలవలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu hyderabad brs telangana-bhavan telanganam harish-rao harishrao palla-rajeswar-reddy hydra-commisioner hydra

Related Articles