తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గత కొంత కాలంగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న హామీని కూడా అమలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి యూనివర్సిటీలో నిరుద్యోగులు నిరనస తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, డీఎస్సీ పరీక్షను పోస్ట్‌పోన్ చేయాలని ఆందోనళకు దిగారు.
దీంతో అలర్ట్ అయిన పోలీసులు మంగళవారం తెల్లవారుజాము నుండే యూనివర్సిటీ బయట భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేట్ మాత్రమే కాకుండా సెంట్రల్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. నిరసనలు తెలిపినా, ధర్నా, ర్యాలీలు నిర్వహించినా అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
కాగా, తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గత కొంత కాలంగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న హామీని కూడా అమలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు.
గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని, ప్రస్తుతం ఉన్న డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వారికి మద్దతుగా యూనివర్సిటీ విద్యార్థులు కూడా నిరసనలు తెలుపుతున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.