రబీ సీజన్లో విత్తన పురోగతి మందగించడంమే దీనికి కారణం. ఇది టమాటాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే టమాట ధరలు భారీగా పెరిగాయి.
న్యూస్ లైన్ డెస్క్: నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటాయి. కాస్త దిగుబడి పెరగడంతో ఉల్లి ధరలు తగ్గాయని ఊపిరి పీల్చుకున్న సామాన్యులకు ఇప్పుడు టమాట చుక్కలు చూపించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ మార్పు కారణంగా కూరగాయల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. రబీ సీజన్లో విత్తన పురోగతి మందగించడంమే దీనికి కారణం. ఇది టమాటాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే టమాట ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాస్త తగ్గిన కిలో టమాట ధర.. తాజగా వందకు పైగానే ఉన్నట్లు సమాచారం.
గతంలో హైదరాబాద్‌లో రైతుబజార్లకు 6వేల క్వింటాళ్ల వరకు టమాటాల దిగుబడి ఉండేది. కానీ, ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లకు పడిపోయింది. ఫలితంగా టమాటాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి.