భూమిపై పుట్టిన ప్రతి మనిషి బట్ట, పొట్ట, ఇల్లు తప్పనిసరిగా కోరుకుంటాడు. డబ్బున్న వాళ్ళైతే ఎలాంటి విలాసవంతమైన ఇండ్లయినా కట్టుకుంటారు. పేద, మధ్య తరగతి వారికి ఇల్లు కట్టడం కష్టం.
న్యూస్ లైన్ డెస్క్: భూమిపై పుట్టిన ప్రతి మనిషి బట్ట, పొట్ట, ఇల్లు తప్పనిసరిగా కోరుకుంటాడు. డబ్బున్న వాళ్ళైతే ఎలాంటి విలాసవంతమైన ఇండ్లయినా కట్టుకుంటారు. పేద, మధ్య తరగతి వారికి ఇల్లు కట్టడం కష్టం. కొంతమందికి ఇల్లు కట్టాలనే ఎంతో కోరిక ఉన్నా కానీ అది నెరవేరకుండా అలాగే ఆగిపోతూ ఉంటుంది. సొంత ఇంటి కల నెరవేరాలంటే కొన్ని పరిహారాలు చేయక తప్పదట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో ఎంతో కష్టపడతారు. పట్టణాల్లో అయితే ఇల్లు కల నెరవేరడం మహాకష్టం. కానీ సొంత ఇల్లు కట్టుకోవడానికి మంచి బలం కావాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు సూచించారు. ఈ పరిహారాల వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చి అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి తొందరలోనే వెళ్ళిపోతారు.. సొంత ఇంటి కోసం మీకు ముఖ్యంగా శని అనుగ్రహం కావలసి ఉంటుంది.
కాబట్టి మీరు శనిదేవుని ముందుగా ప్రార్థించాలి. పడమర దిక్కును శని దేవుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి శనివారం రోజున పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రం చదవాలి. మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి. చేస్తే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇదే కాకుండా మంగళవారం రోజున తెల్లని ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీరు కోరుకున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది.
మీరు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉన్నట్లయితే నివసించే ఇంట్లో పడమర దిక్కులో రాగితో చేసిన ఏదైనా అలంకార వస్తువులు పెట్టాలి. దీనివల్ల శని అనుగ్రహం లభించి మీ యొక్క సొంత ఇంటి కల నెరవేరుతుంది. అంతేకాకుండా మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి పక్షులకు తప్పనిసరిగా గింజలను నీళ్లు పెట్టడం వంటివి చేయాలి. దీనివల్ల కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ పెరిగి సొంత ఇంటి కల నెరవేరుతుందని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు.