SOCIAL MEDIA: కన్నడ రాకపోతే బెంగుళూరు వాళ్లు కానట్లే ..ఇన్ స్టాలో ట్రెండింగ్ టాపిక్ !

'బెంగళూరు వచ్చే ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడకపోయినా, మాట్లాడే ప్రయత్నం చేయకపోయినా బయటి వ్యక్తులు


Published Sep 09, 2024 04:37:00 PM
postImages/2024-09-09/1725880105_Screenshot20240909163341.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బెంగుళూరులో ఉంటూ కన్నడ మాట్లాడకపోతే ..వాళ్లు అసలు కన్నడవాళ్లే కాదు.. బెంగుళూరు కన్నడ వాళ్లది మాత్రమే ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇదే . చిన్న ఇన్ స్టా పోస్ట్ బెంగుళూరు మొత్తాన్ని ఫుల్ హీట్ లో నడిపిస్తుంది. ఆ పోస్ట్ ఏంటంటే 'బెంగళూరు వచ్చే ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడకపోయినా, మాట్లాడే ప్రయత్నం చేయకపోయినా బయటి వ్యక్తులు ('అవుట్‌ సైడర్స్‌')గా చూస్తారు. అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 


'ఔట్ సైడర్-ఇన్ సైడర్' డిబేట్ మరోసారి సోషల్ మీడియాలో ఊపందుకుంది. బెంగుళూరు లో దాదాపు జనాలంతా సెటిలర్సే. టెక్ క్యాపిటల్ కావడంతో అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ ఉంటున్నారు.  అయితే మంజు అనే యూజర్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇకా, 'ఇది జోక్‌ కాదు... బెంగళూరు కన్నడిగులదే.. ఇతర భాషలను ఇక్కడ అంగీకరించబోం' అంటూ అదే ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంకా, ఈ ట్వీట్‌ను షేర్‌ చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఈ ట్వీట్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీని పై ట్విట్టర్ లో పెద్ద యుధ్దమే జరుగుతుంది.


భారత్ లో కర్ణాటక ఓ భాగం..భారత్ లో  అన్ని రాష్ట్రాలను గౌరవిస్తాం. అంతకంటే ప్రజల మనోభావాలను కూడా గౌరవించాలి. భాష ఆధారంగా మనుషులను విడదీయడం కరెక్ట్ కాదంటున్నారు నెటిజన్లు. నిజానికి బెంగుళూరు లో కన్నడ రావాలనే రూల్ లేదు. అక్కడ స్థానికులు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. వచ్చిన చిక్కల్లా ...ఈ ట్విట్టర్ లో ఉన్న కన్నడవాళ్లకే అని మరికొంతమంది అంటున్నారు. ఏం చెప్పినా కన్నడ మాట్లాడాల్సిందే అంటున్నారు కన్నడీగులు..ఏం జరగుుతుందో చూడాలి. గొడవ మాత్రం మాంచి హీటు మీదుంది.
 

newsline-whatsapp-channel
Tags : karnataka- kannada social-media viral-video

Related Articles