PANIPURI: షాకింగ్ న్యూస్ పానీ పూరీ బ్యాన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం !

దీని కోసం ఫుడ్ సేఫ్టీ రాష్ట్ర వ్యాప్తంగా 200 వరకు పానీపూరీ నమూనాలను సేకరించి పరీక్షకు పంపించారు.


Published Oct 30, 2024 03:51:00 PM
postImages/2024-10-30/1730283690_TwoboysdiedaftereatingPanipuriinAP.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సగం అమ్మాయిలకి హార్ట్ అటాక్ వస్తుంది ఈ వార్త చూశాక..పానీపూరీ లవర్స్ అంటే ...80 శాతం ఆడపిల్లలే...ఏముంటుందో ఆ పానీపూరీలో ..పోనిలే ఎవరిటేస్ట్ వాళ్లది కాని ..స్ట్రీట్ ఫుడ్ కింగ్ అయిన పానీపూరీ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. ఎక్కడ చూడు పానీపూరీనే. ఈ మధ్య మరీ సందు సందుకి అమ్మేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడు పానీపూరీ తయారీలో కల్తీ జరగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. 


కర్ణాటకలో దొరికిన పానీపూరిలో ఆరోగ్య ప్రమాణాలు సరిగా లేవని అధికారులు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. దీని కోసం ఫుడ్ సేఫ్టీ రాష్ట్ర వ్యాప్తంగా 200 వరకు పానీపూరీ నమూనాలను సేకరించి పరీక్షకు పంపించారు. గత రెండు మూడు రోజుల నుంచి పానీపూరి తయారీదారులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ రిజల్ట్ కాని తేడాగా వస్తే పక్కా బ్యాన్ దిశగా అడుగులు వేస్తారంటున్నారు .


బెంగుళూరులో 49 స్పాట్ లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పానీపూరీ నమూనాలు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన 243 శాంపిల్స్ లో 41 నమూనాల్లో కృత్రిమ రంగు,క్యాన్సర్ కు కారణమయ్యే కార్సినోజెనిక్ ఏజెంట్లను గుర్తించారు. దాదాపు 18 శాంపిల్స్ వరకు మానవ వినియోగానికి పనికిరావని ఫుడ్ సెఫ్టీ అండ్ క్వాలిటీ విభాగం కమీషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ పానీపూరి తిన్నవారిలో చాలామందికి  అల్సర్లు, క్యాన్సర్లు వస్తాయంటున్నారు. ఒక్క కర్ణాటకలోనే కాదు...చెన్నైలో కూడా పానీపూరీ పై చాలా విమర్శలున్నాయి. బయట పానీపూరీ తినాలంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu karnataka- pani-puri health-problems

Related Articles