కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లపై మే 28న విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును వాయిదా వేశారు. సోమవారం కూడా విచారణ జరిపారు. ఈడీ, సీబీఐతో పాటు కవిత తరఫు లాయర్ వాదనలు విన్న న్యాయస్థానం కవిత పిటిషన్లను రిజెక్ట్ చేసింది. కాగా, ఇప్పటికే కవిత వేసిన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే.
న్యూస్ లైన్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బెయిల్ పిటిషన్(Bail petition)ను ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor policy case)లో అరెస్ట్ ఐన ఆమె మూడు నెలలుగా తీహార్ జైల్లో(Thihar jail)నే ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవితపై సీబీఐ, ఈడీ(CBI, ED) వేరువేరు కేసులు నమోదు చేశాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత అక్రమాలకు పాలపడ్డారని ఆరోపించాయి. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్లు దాఖలు చేశారు.
కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లపై మే 28న విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును వాయిదా వేశారు. సోమవారం కూడా విచారణ జరిపారు. ఈడీ, సీబీఐతో పాటు కవిత తరఫు లాయర్ వాదనలు విన్న న్యాయస్థానం కవిత పిటిషన్లను రిజెక్ట్ చేసింది. కాగా, ఇప్పటికే కవిత వేసిన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె కేసు విచారణల్లో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది.