ఆగస్టు నెల వచ్చిందంటే చాలు శ్రావణమాసం మొదలవుతుంది. ఈ మాసంలో అనేక పండుగలు వస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ పండగను భారతదేశంలో అంగరంగ వైభవంగా
న్యూస్ లైన్ డెస్క్: ఆగస్టు నెల వచ్చిందంటే చాలు శ్రావణమాసం మొదలవుతుంది. ఈ మాసంలో అనేక పండుగలు వస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ పండగను భారతదేశంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీ సోమవారం వచ్చింది. ఈ రోజున హిందూ సాంప్రదాయం పాటించే ప్రతి భారతీయుడు శ్రీకృష్ణున్ని తప్పనిసరిగా పూజిస్తారు. అంతేకాదు ఈ రోజున తప్పనిసరిగా మిధున రాశిలోకి కుజుడు ప్రవేశం పొందుతాడు. అప్పటినుంచి వరుసగా 45 రోజుల పాటు ఇదే రాశిలో ఉంటాడు. ఆ తర్వాత కుజుడు, మిధున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. అయితే కృష్ణాష్టమి రోజున కుజ మిధున రాశి సంచారం అనేది కొన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుందట. దీనివల్ల వారి శుభ ఫలితాలు పొందడమే కాకుండా ధన లాభం కూడా వస్తుందట. వారెవరో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి :
కుజ సంచారం వల్ల మేష రాశి వారు చాలా అదృష్టవంతులవుతారట. ఏ పనైనా సరే ధైర్యంతో చేస్తారట. ఇంతకుముందు ఆర్థికంగా నష్టపోతు ఉన్నట్లయితే ఇప్పటినుంచి లాభాలు పొందుతారట. కుటుంబంతో కూడా హ్యాపీగా జీవిస్తారట.
వృషభ రాశి :
ఈ రాశి వారికి గతంలో కంటే ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయట. ముఖ్యంగా జన్మాష్టమి నాడే వీరు కొత్త వ్యాపారాన్ని చేపట్టి లాభాల బాట పొందే దిశగా ప్రయాణిస్తారట.
కర్కాటక రాశి:
శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి ఈ రాశి వారికి గడ్డు రోజులు ముగుస్తాయి. ఉద్యోగాల కోసం ట్రై చేసే వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయట. అంతేకాకుండా వ్యాపారం చేసేవారికి ఇప్పటినుంచి లాభాలు పొందుతారని, ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
సింహరాశి :
ఇక ఈ రాశి వారికి శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి శుభ ఘడియలే ఉంటాయని, సింహంలా జీవిస్తారని జ్యోతిష్య పండితులు అంటున్నారు. డబ్బు సంపాదించడానికి వీరికి అనేక మార్గాలు ఎదురు వస్తాయట. ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయమని నిపుణులు అంటున్నారు.
కుంభరాశి :
ఈ రాశి వారు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లయితే శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి అనేక శుభాలను పొందుతారట. వ్యాపారాలలో కూడా పుంజుకుంటారని, ఫ్యామిలీతో కూడా గడపడానికి సమయం దొరుకుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.