KRISHNASTAMI: కృష్ణాష్టమి ఉట్టు ఎందుకు కొడతారు..ఉట్టిలో ఏం వేస్తారో తెలుసా ?

కృష్ణాష్టమి అందమైన హుషారైన ఘట్టం..ఉట్టి కొట్టడం . కుర్రాళ్లకు భలే హుషారు తెప్పించే ఆట కూడా. 


Published Aug 24, 2024 05:53:00 PM
postImages/2024-08-24/1724502255_SriKrushnaJayanthigrandlycelebratedwithdevotees1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శ్రీకృష్ణుడి పుట్టిన రోజు వచ్చేస్తుంది. వీధుల్లో బాల కృష్ణులు..చిన్నిచిన్ని రాధమ్మల సందళ్లు పెరుగుతాయి. ఉట్టి కొట్టడం..రాధలాగా ..కృష్ణుడులాగా పిల్లల్ని రెడీ చేయడం..గోకులాష్టమి సందడి ..బృందావన కృష్ణుడు నేలకు రాక తప్పదు. అంత ముచ్చటగా ఉంటారు పిల్లలు. అయితే కృష్ణాష్టమి అందమైన హుషారైన ఘట్టం..ఉట్టి కొట్టడం . కుర్రాళ్లకు భలే హుషారు తెప్పించే ఆట కూడా. 


హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. ఆయన జన్మదినాన్ని  కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అనే పేర్లతో జరుపుతారు. అసలు ద్వారక, మధుర లాంటి ప్రాంతాల్లో గోకులాష్టమి చాలా పెద్ద పండుగ. మనం కూడా చేస్తాం కాని ..వీళ్లు చేసినంత బాగా మనం చెయ్యలేం. కృష్ణాష్టమిని చాలా భక్తిగా చేస్తారు. 


ఆ రోజు సంతానం లేని వాళ్లు ఉపవాసం ఉండి భక్తితో కిట్టయ్యను మొక్కితే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు కూడా.పగలంతా ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం పూజలు చేస్తారు. స్వామికి ఎంతో ఇష్టమైన పళ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, మీగడ నైవేద్యం పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ పాటలు, కీర్తనలు పాడతారు. ఈ ఏడాది కృష్ణాష్టమి 29 న జరుపుకుంటున్నాం. కృష్ణలీలలు తెలియడం కోసమే ఈ ఉట్టి కొడతారు. చుట్టు కుర్రాళ్లు, సందడి, స్నేహితులు, చిలిపిపనుల్లో కూడా స్నేహితుల నుంచి సాయం తీసుకోవడం ..పిల్లలు అందరు కలిసి ఆడుకోవాలనే చెప్పే కృష్ణలీలలు ఉట్టి వేడుక ద్వారా పిల్లలకు తెలియజేస్తుంటారు.


ఉట్టి కొట్టే వేడుకను ఉత్తరాదిన ‘దహీ హండీ’ అని పిలుస్తారు.  హండీ లో వెన్న , పచ్చి పాలు, గంధం, పసుపు , పెరుగు, సువాసన వచ్చే పూలు హండీకి కట్టి ...తేనె కూడా వేసి ఆ ఉట్టెను పైకి కట్టి ...దానిని కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. యువకులంతా ఈ ఆటకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi krishna pooja

Related Articles