KTR: నగరంలో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే..!

కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని తెలిపారు. వర్ష కాలం కావడంతో డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. 


Published Jul 25, 2024 01:36:42 AM
postImages/2024-07-25/1721889363_modi20240725T120226.888.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని ఆయన గుర్తుచేశారు. 

బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని తెలిపారు. వర్ష కాలం కావడంతో డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. చెత్త తరలింపు అనేది కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తోందని విమర్శించారు. 

GHMC మేయర్‌ గద్వాల్ విజయలక్ష్మి, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతోందని వెల్లడించారు. ర్యవేక్షించాల్సిన పార్ట్-టైం మున్సిపల్ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని కేటీఆర్ తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని.. పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని సూచించారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news newslinetelugu brs tspolitics telanganam telugu-news ghmcmayor muncipalminister

Related Articles