కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయని తెలిపారు. మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు అడగడుగునా దర్శనమిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. జర్నలిస్టులపట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీలో.. జీన్యూస్ రిపోర్టర్, కెమెరామెన్‌లను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా..? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా.. డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా..? అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
మంగళవారం కూడా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీన్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా? ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయని తెలిపారు. మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు అడగడుగునా దర్శనమిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. జర్నలిస్టులపట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదని, జీన్యూస్ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.