Politics: మరోసారి మహిళా కమిషన్ వద్దకు కేటీఆర్..!

తాను యధాలాపంగా మాట్లాడిన మాట పట్ల విచారం వ్యక్తం చేశానని మహిళ కమీషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా తాను మాట దొర్లటంపై క్షమాపణ అడిగినట్లు కేటీఆర్ తెలిపారు. 


Published Aug 24, 2024 02:05:40 PM
postImages/2024-08-24/1724488540_ktratmahilacommission.jpg

న్యూస్ లైన్ డెస్క్: మహిళా కమీషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా కమీషన్ ముందు హాజరయ్యానని అన్నారు. తాను యధాలాపంగా మాట్లాడిన మాట పట్ల విచారం వ్యక్తం చేశానని మహిళ కమీషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా తాను మాట దొర్లటంపై క్షమాపణ అడిగినట్లు కేటీఆర్ తెలిపారు. 

చట్టాన్ని గౌరవిస్తూ కమీషన్ ముందుకు వస్తే.. మహిళా కాంగ్రెస్ నేతలు తమ నాయకులపై దాడి చేశారని ఆయన అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో వస్తే ఇలాంటి దాడి చేయటం సరికాదని అన్నారు. గడిచిన 8 నెలల్లో మహిళలపై జరిగిన సంఘటనలను వారికి ఇచ్చే ప్రయత్నం చేశానని కేటీఆర్ అన్నారు. అన్ని వివరాలతో వచ్చినప్పటికీ మళ్లీ రావాలని కమీషన్ చెప్పిందని.. గౌరవిస్తూ మళ్లీ వస్తామని కేటీఆర్ అన్నారు. 

కానీ, BRS నాయకురాల్లపై దాడి చేసిన ఘటన మంచిది కాదని కేటీఆర్ అన్నారు. BRS నాయకురాల్లపై జరిగిన దాడిపై కూడా మహిళా కమీషన్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ అంశాన్ని మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తున్నానని కేటీఆర్ అన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu hyderabad brs tspolitics ktr women-commission

Related Articles