రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్‌ని అవమానించేలా మాట్లాడారని తెలిపారు. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ తెలిపారు. అందుకే ఈరోజు తెలంగాణ యువత భగ్గుమంటుందని అన్నారు. BRSను గద్దె దించి కాంగ్రెస్ నేతలను గద్దెనెక్కించిన యువత ప్రశ్నిస్తోందని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి కండకావరం తగ్గించుకోవాలని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు తమకు మాత్రం ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు, మరొకరు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు, మరొకరు లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు అని రేవంత్, రాహుల్ గాంధీలను ఉద్దేశించి అన్నారు.
రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్‌ని అవమానించేలా మాట్లాడారని తెలిపారు. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ తెలిపారు. అందుకే ఈరోజు తెలంగాణ యువత భగ్గుమంటుందని అన్నారు. BRSను గద్దె దించి కాంగ్రెస్ నేతలను గద్దెనెక్కించిన యువత ప్రశ్నిస్తోందని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్.. 8 నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మిగిలిన నాలుగు నెలల్లో ఏ రకంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులను వదిలేదని, క్షేత్రంలో నిలదీస్తాం విద్యార్థులతో నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతామని హెచ్చరించారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు.. లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశమని కేటీఆర్ తెలిపారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఈగోకి, బేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
రేవంత్ రెడ్డి నిరుద్యోగులు, విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ముమ్మాటికే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే అని తెలిపారు. ఏ పరీక్ష రాశారని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో దీక్ష చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అశోక్ నగర్‌లోని విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్ రెడ్డి.. మీరు సన్నాసులా.. రాహుల్ గాంధీ సన్నాసులు అనే విషయం చెప్పాలని అన్నారు. అశోక్ నగర్‌లో, యూనివర్సిటీలో పిల్లలను ఈడ్చుకుపోతున్న అంశం వాస్తవం కాదా రేవంత్ రెడ్డి చెప్పాలని అన్నారు.
రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నాడు.. ఆయన ముఖ్యమంత్రిని అనే విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే ఆయనకే మంచిదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల పైన, నోటిఫికేషన్లపైన, జాబ్ క్యాలెండర్ పైన శ్వేత పత్రం ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అశోక్ నగర్, దిల్‌సుఖ్‌నగర్, రాష్ట్రంలోని యూనివర్సిటీలలో విద్యార్థులు అడుగుతున్నది కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే కదా..? అని ఆయన ప్రశ్నించారు.