వెలగకాయలు , కజ్జికాయలు ..కుడుములు, ఉండర్రాళ్లు, వడపప్పు, పానకం బోలెడు వంటకాలతో గణనాథునికి స్వాగతం పలుకుతారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : గణేష్ సంబరాలు వచ్చేస్తున్నాయి. మరో వారంలో బుజ్జి గణపయ్య హ్యాపీ బర్త్ డే. భక్తులు పెట్టే ప్రసాదాలకు స్వామివారి పొట్ట పట్టదు ..అంత ఇష్టంగా చేస్తారు వినాయకచవితి. అయితే ప్రతి ఇంట విఘ్ననాథుని పుట్టిన రోజును వేడుకలా చేసుకుంటారు. ప్రతిమలు పెడతారు..మండపాలు వేస్తారు. వెలగకాయలు , కజ్జికాయలు ..కుడుములు, ఉండర్రాళ్లు, వడపప్పు, పానకం బోలెడు వంటకాలతో గణనాథునికి స్వాగతం పలుకుతారు. అయితే ప్రతి ఇంట్లో పెట్టుకునే వినాయకుడికి తొండం ఎలా ఉండాలో తెలుసుకుందాం రండి.
వినాయకునికి గుడిలో ఉంటే కుడి వైపు తొండం ఉంటుంది. ఎడమ వైపు ఉంటే ఇంట్లో చేసుకునే పూజకు శుభసూచికం. అయితే ఇంతకు మందు దాదాపు ఓ 50 యేళ్ల కు ముందు అయితే ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాలు పెట్టేవారు. ప్రతి వినాయకునికి పూజలు చేసి చక్కగా ఆ పెట్టిన ఆకులు , పత్రి , పసుపు లాంటివి పారే నీటిలో వేసి ...ఓ రాగి ఖానీ వేసి దేవ దేవ నువ్వే ఉన్నావని మొక్కే వారు అప్పుడు అవే నీళ్లు తాగేవారు కూడా . అంత వరకు హ్యాపీనే.
కాని పసుపు వినాయకుడి కంటే మంచి పని ఇంకొకటి లేదు. హ్యాపీ గా వాతావరణానికి హాని ఉండదు. వినాయకుడి తొండం ఎటు ఉండక్కర్లేదు. పర్యావరణ ప్రియులయితే దీనికి మించిన సుఖం మరొకటి లేదు. నిజానికి మనం చేసే ప్రతి పూజలోను ..వాతావరణానికి , పర్యావరణానికి మంచి చెయ్యాలనే పెద్దలు కొన్ని నియమాలు పెడతారు. మనం వాటిని ఎప్పుడు ఓ పాతికేళ్ల ముందే పాతిపెట్టేశాం. ఇఫ్పుడు మనం చెయ్యాల్సిందల్లా ఉన్నదానిని చెడగొట్టకుండా చక్కని మట్టి విగ్రహాన్ని కుడి వైపు తొండం ఉన్న విగ్రహానికి పూజలు చేసుకొండి. స్థోమత లేదంటే పసుపు కూడా ఉత్తమమైనదే.