Mamta Mohandas: రజినీకాంత్ తో నటించి తప్పు చేశా..! 2024-06-19 07:18:45

న్యూస్ లైన్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్(Rajinikanth) సినిమాలో అవకాశం వస్తే స్టార్ హీరోయిన్లయినా సరే ఎగిరి గంతేయ్యాల్సిందే.ఎందుకంటే ఆ హీరోతో ఒక సినిమాలో చిన్న పాత్రలోనైనా నటించాలి అని కోరుకునే హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు.ఇక కొంతమంది హీరోయిన్ల కైతే సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించడం ఒక డ్రీమ్ గా ఉంటుంది. అయితే ఎంతోమంది హీరోలు రజినీకాంత్ నటించడం అదృష్టం అనుకుంటే ఈ హీరోయిన్ మాత్రం దురదృష్టం అనుకుంటుంది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు మమతా మోహన్ దాస్(Mamta Mohandas) .. తెలుగు, తమిళ,మలయాళ సినిమాల్లో నటిగా రాణించిన మమతా మోహన్ దాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి అయితే దూరంగా ఉంది. ఇక ఈమె తెలుగులో యమదొంగ(Yamadonga) , రగడ,కృష్ణార్జున, హోమం,రుద్రాంగి,కింగ్ వంటి సినిమాల్లో నటించింది.అయితే అప్పట్లో ఈ హీరోయిన్ ఏదో వ్యాధి బారిన పడిందనే వార్తలు కూడా మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మమతా మోహన్దాస్(Mamta Mohandas) తమిళ,మలయాళ సినిమాల్లో నటిస్తోంది.