రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరినీ విచారణ కు పిలిచారు. తన ఆస్తిలో మంచు మనోజ్ పాగా వేశారని గతంలో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మంచు ఫ్యామిలీ గొడవలు చిలికి చిలికి తుఫాను అయ్యాయి. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా మంచు మనోజ్ ఆవేశంగా వెళ్లిపోయారు. మంచుఫ్యామిలీలో ఆస్థి వివాదాలు మరింత పెరిగాయి. విచారణ లో మెజిస్ట్రేట్ ముందే తండ్రి కొడుకులు తిట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరినీ విచారణ కు పిలిచారు. తన ఆస్తిలో మంచు మనోజ్ పాగా వేశారని గతంలో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.
ఆస్తి తగాదాలో భాగంగా నటుడు మోహన్ బాబు ఫైల్ చేసిన సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద మంచు మనోజ్ పై సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 3 గంటలకు కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు మోహన్ బాబు, మంచు మనోజ్. లాస్ట్ మంథ్ 18న రంగారెడ్డి జిల్లా అదనపు మెజిస్ట్రేట ఎదుట విచారణకు హాజరై అన్ని వివరాలు వెల్లడించారు. ఆస్తి తగాదాకి సంబంధించి అదనపు కలెక్టర్ కి పూర్తి వివరాలు అందజేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెనుదిరిగారు మోహన్ బాబు, మనోజ్.
అతసుమారు రెండు గంటల పాటు మెజిస్ట్రేట్ విచారణ సాగింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా మంచు మనోజ్ ఆవేశంగా వెళ్లిపోయారు.