సాధారణంగా గ్రహాల యొక్క కదలికలు మానవ జీవితంపై ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటూ ఉంటారు. అలా గ్రహాల తిరోగమనలు చేయడం వల్ల మన రాశుల్లో మార్పులు వచ్చి మన
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా గ్రహాల యొక్క కదలికలు మానవ జీవితంపై ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటూ ఉంటారు. అలా గ్రహాల తిరోగమనలు చేయడం వల్ల మన రాశుల్లో మార్పులు వచ్చి మన జీవితంలో అనేక సంఘటనలు ఎదురవుతాయి. ఇందులో శుక్రాదిత్య యోగం వల్ల పలు రాశుల వారికి మంచి జరుగుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. మరి ఆ రాశి ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
9 గ్రహాలలో సూర్యుడు అత్యంత శక్తివంతమైన గ్రహం. సూర్యుడు నెలకు ఒక్కసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు.. దీనివల్ల కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. గ్రహాలలో శుక్రుడు అత్యంత విలాసవంతమైనటువంటి గ్రహం. సంతాన సాఫల్యం సంపద విలాసవంతమైన జీవితం గడపడానికి శుక్రుడు కారకుడు. శుక్రుడు తన స్థానాన్ని మార్చినప్పుడు అన్ని రాశులపై ప్రభావం పడుతుందట.
#1. కర్కాటక రాశి:
శుక్రుడు సూర్యుడి కలయిక ఈ కర్కాటక రాశి వారిపై ప్రభావం చూపుతుంది. వీరు ఏ పని మొదలుపెట్టిన అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఎక్కడైనా మొండి బకాయిలు ఉంటే అవి వెతుక్కుంటూ వస్తాయి.
#2. మిథున రాశి :
శుక్రుడు, సూర్యుడు కలయిక ఈ రాశి రెండవ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపార సముదాయాలు లాభాలు పెరుగుతాయి. కుటుంబం ఆనందంగా జీవిస్తుంది.
#3. కన్యా రాశి :
సూర్యుడు మరియు శుక్రుడు ఈ రాశి వారి పదకొండవ ఇంట్లో కలిసి వస్తాడు. దీనివల్ల ఈ రాశి వారికి అనూహ్యంగా లాభాలు పెరుగుతాయి. కొత్తగా ఆదాయాన్ని పెంచే పనులు వీరి దగ్గరికి వస్తాయి. జీవితంలో ఏది సాధించాలనుకున్నారో అది తప్పనిసరిగా జరిగిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.