Pawan:పవన్ కళ్యాణ్ సినీ జీవితాన్నే మార్చిన సినిమాలు.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి హోదా ఉందో మనందరికీ తెలుసు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాల్లో కూడా రాటుదేలారు. దేశ రాజకీయాల్లో


Published Sep 01, 2024 02:43:59 PM
postImages/2024-09-01/1725182039_pawankalyan.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి హోదా ఉందో మనందరికీ తెలుసు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాల్లో కూడా రాటుదేలారు. దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా మారారు. మరి ఆయనకింతటి గౌరవం రావడానికి ప్రధాన కారణం సినిమాలే అని చెప్పవచ్చు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ ను మార్చినటువంటి కొన్ని చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

#1.  సుస్వాగతం:
 బీనవేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై వచ్చిన సినిమా సుస్వాగతం. చిత్రం అద్భుతమైన హిట్స్ సాధించి పవన్ కళ్యాణ్ కెరియర్ లో దూసుకుపోయేలా చేసింది. 

#2.  తొలిప్రేమ:
 ఏ కరుణాకరన్ డైరెక్షన్ లో  పవన్ కళ్యాణ్ కీర్తిరెడ్డి హీరో హీరోయిన్లుగా వచ్చిన మూవీ తొలిప్రేమ.  ఈ చిత్రం అద్భుతమైన ప్రేమ కథతో  వచ్చి అద్భుతమైన హిట్ సాధించింది. 

#3.  తమ్ముడు:
 పిఏ అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ లో  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ తమ్ముడు. బాలీవుడ్ లో జోజిత వహి సికిందర్ అనే చిత్రానికి రీమేక్ గా వచ్చి అద్భుతమైన హిట్ సాధించింది.  ఇది పవన్ కెరియర్ ను మరోసారి గాడిలో పడేలా చేసింది అని చెప్పవచ్చు. 

#4.  బద్రి:
 గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో అద్భుతమైన కథాంశంతో వచ్చిన మూవీ బద్రి. ఇది పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక డిఫరెంట్ మూవీగా తెరకెక్కి అద్భుతమైన పేరు తీసుకొచ్చింది.

#5.  ఖుషి:
 ఎస్ జె సూర్య  దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ భూమిక హీరో హీరోయిన్ గా వచ్చిన మూవీ ఖుషి. ఎంతో ఆకట్టుకునే ప్రేమ కథ చిత్రంతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకు.

#6. గబ్బర్ సింగ్ :
 గ్రేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్. హిందీ చిత్రం దబాంగ్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది.

#7.  వకీల్ సాబ్:
 సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత  వచ్చిన మూవీ వకీల్ సాబ్. కరోనా సెకండ్ వేవ్ లో రిలీజ్ అయి అద్భుతమైన విజయాన్ని సాధించింది.

newsline-whatsapp-channel
Tags : pawankalyan news-line kushi badri vakilsab suswagatham

Related Articles