Mutton Bone Soup: వేడి వేడి పాయా ...ఎంత హెల్దీ ..యమ టేస్టీ కూడా!

నార్మల్ సూప్స్ కంటే మటన్ పాయా చాలా టేస్టీ ఇంకా హెల్దీ కూడా.సాధార‌ణంగా మేక లేదా గొర్రె ముంగాళ్ల ముక్క‌ల‌తో త‌యారుచేసే పులుసే ఈ పాయా లేదా కాళ్ల షోర్వా


Published Oct 25, 2024 10:33:00 PM
postImages/2024-10-25/1729875894_Bonebrothv2.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్;  జ‌లుబు, గొంతు నొప్పి, కాళ్లుచేతులు విరిగిన వాళ్లకు పాయా తాగ‌మ‌ని పెద్ద‌లు స‌ల‌హా ఇచ్చేవారు. ఇదే విషయాన్నీ ఇప్పుడు పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. కీళ్ల నొప్పులున్నవారికి దీనిని తినే ఆహారంలో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు . అయితే నార్మల్ సూప్స్ కంటే మటన్ పాయా చాలా టేస్టీ ఇంకా హెల్దీ కూడా.


సాధార‌ణంగా మేక లేదా గొర్రె ముంగాళ్ల ముక్క‌ల‌తో త‌యారుచేసే పులుసే ఈ పాయా లేదా కాళ్ల షోర్వా. నీరసంగా ఉండే వాళ్లకు పేషెంట్స్ కు ..యాక్సిడెంట్లలో దెబ్బలు తగిలిన వారికి ఈ పాయా మంచి మెడిసిన్. చాలా ఫాస్ట్ గా రిలీఫ్ ఇస్తుంది.  కొంత‌ మంది కోళ్లు, బీఫ్ ఎముక‌ల‌ను కూడ వాడ‌తారు. కాని సాధారణంగా మటన్ పాయా చాలా ఫేమస్ ..చెయ్యడం కూడా చాలా ఈజీ. 


ముందుగా మేక కాళ్లను తీసుకుని వాటిని నీటితో కడిగి వాటిని నిప్పుల మీద కాల్చి గోధుమ పిండి సహాయంతో వాటిమీద ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. తర్వాతా శుభ్రంగా కడుగుతారు. ఒక పాత్రలో కాళ్లను, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, సొంటి, కొబ్బరి, ఇతర మసాల దినులు వేసి నీళ్లు పోసి రెండు, మూడు గంటల పాటు మరిగిస్తారు. అనంతరం ఆ సూప్ లో కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేస్తారు. మళ్ళీ సూప్‌ ని చిక్కబడే వరకూ తక్కువ మంట మీద మరిగిస్తారు. దీంతో ఘుమఘుమలాడే పాయా సిద్ధమవుతుంది.
శ్రమ అధికం.. టెస్ట్ కూడా అధికమే


పాయా తయారీ శ్రమతో కూడుకున్న పనే.. అయితే  దీనికున్న రుచి మరే నాన్‌వెజ్‌ వంటకానికి రాదని చెబుతున్నారు తయారీ దారులు. పాయా హోటళ్లలో చాలా అరుదుగా లభిస్తుంది. దీనిని రుచిగా తయారు చేయాలంటే వంటలు చేయడంలో అనుభవం ఉండాలి. అన్ని మసాలాలు కలిసి రుచిగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.
 

ఇటీవలే ఈ వంటకం బాగా పాపులర్ అయినా.. ఇది చాలా పురాతన కాలం నాటి వంటకమే.. అప్ప‌ట్లో జ‌లుబు, గొంతు నొప్పి, కాళ్లుచేతులు విరిగిన వాళ్లకు పాయా తాగ‌మ‌ని పెద్ద‌లు స‌ల‌హా ఇచ్చేవారు. ఇదే విషయాన్నీ ఇప్పుడు పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. కీళ్ల నొప్పులున్నవారికి దీనిని తినే ఆహారంలో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు కూడా.. పాయాలో కొలాజెన్ అనే ప్రొటీన్ విరివిగా ఉంటుంది. ఇది చ‌ర్మ‌ సౌంద‌ర్యాన్ని పెంచి పోషిస్తుంది. వివిధ ర‌కాలైన ఖ‌నిజాలు నొప్పి నివార‌ణ‌కు, గాయాలు తొంద‌ర‌గా మాన‌డానికి, ఎముక‌ల‌కు బ‌లాన్నివ్వ‌డానికి ప‌నికి వ‌స్తాయి

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mutton health-benifits food-habits

Related Articles