INDIA : భూకంపంతో నష్టపోయిన మయన్మార్ కు భారత్ భారీ సాయం !

భారీ భవనాలు కూలిపోవడంతో గాయపడిన వారికి చికిత్స అందించాడానికి అవసరమైన మందులను కూడా పంపించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.  


Published Mar 29, 2025 10:53:00 AM
postImages/2025-03-29/1743225941_ANI20250328231615.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: నిన్న మయన్మార్ , థాయిలాండ్ కు భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం వచ్చిన భూకంపం కారణంగా మయన్మార్ లో తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ..ప్రాణ నష్టం జరిగింది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపింది. హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి శనివారం ఉదయమే విమానం బయలుదేరి వెళ్లింది. 


భూకంప బాధితులు ఫుడ్ , దుప్పట్లు , టెంట్లు ,వాటర్ ప్యూరిఫయర్లు , సోలార్ ల్యాంప్స్ , జెనరేటర్లు తీసుకువెళ్లింది.అయితే భారీ భవనాలు కూలిపోవడంతో గాయపడిన వారికి చికిత్స అందించాడానికి అవసరమైన మందులను కూడా పంపించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.  ఈ విమానం శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మయన్మార్ లోని యాంగాన్ ఎయిర్ పోర్ట్ లో దిగిందని భారత దౌత్యవేత్త రణధీర్ జైశ్వాల్ ట్వీట్ చేశారు. మానవతా సహాయంగా ఈ విమానాన్ని పంపామని, అవసరాన్ని బట్టి మరింత సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu earth food, india food helping- helping earth-quake mayanmar

Related Articles