వరుణ్ సందేశ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్తారుగా పేరు ఉన్నటువంటి హీరో. హ్యాపీ డేస్ అనే సినిమా ద్వారా కాస్త నిరూపించుకున్నాడు. అలాగే కొత్త బంగారులోకం సినిమా ద్వారా ఇండస్ట్రీ చూపు మొత్తం
న్యూస్ లైన్ డెస్క్: వరుణ్ సందేశ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్తారుగా పేరు ఉన్నటువంటి హీరో. హ్యాపీ డేస్ అనే సినిమా ద్వారా కాస్త నిరూపించుకున్నాడు. అలాగే కొత్త బంగారులోకం సినిమా ద్వారా ఇండస్ట్రీ చూపు మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఈ మూవీ ఆయన కెరియర్ లోనే భారీహీట్ కొట్టింది. అలాంటి వరుణ్ సందేశ్ ఈ మూవీ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన అన్ని ఫ్లాప్ అయిపోయాయి. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైన వరుణ్ సందేశ్ తాజాగా విభిన్నమైన కథలతో మన ముందుకు వస్తున్నారు. అయితే ఆయన హీరోగా చేసినటువంటి మూవీ నింద. కాండ్రకోట మిస్టరీ అనే ట్యాగ్ లైన్ తో దర్శకుడు రాజేష్ జగన్నాథం తెరకేక్కించిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా చేశారు. ఈయనతో పాటు చత్రపతి శేఖర్, తనికెళ్ల భరణి, యాని కీలకమైన పాత్రలో నటించారు. జూన్ నెలలో థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం తాజాగా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది ఆ వివరాలు ఏంటో చూద్దాం..
కథ:
ఏపీలోని కాండ్రకోట గ్రామం చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. ఇందులో బాలరాజు పాత్రలో చత్రపతి శేఖర్ చేశారు. ఇందులో మంజు అనే అమ్మాయిని హత్య చేశారని బాలరాజును పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అతనిపై నేరం ఋజువు అవ్వడంతో ఉరి శిక్ష కూడా పడుతుంది. అయితే ఈ కేసు కు సంబంధించి తీర్పు ఇచ్చింది సత్యానంద్( తనికెళ్ల భరణి ) తాను చేసే వృత్తిపరంగా న్యాయం చేసినా, వ్యక్తిగతంగా మరణ శిక్ష వేసి అన్యాయం చేశానని కుమిలిపోతూ ఉంటాడు. ఇందులో తనికెళ్ల భరణి కొడుకుగా వివేక్ ( వరుణ్ సందేశ్ )చేస్తాడు. అయితే అన్యాయంగా నిర్దోషికి శిక్ష వేశానంటూ తన కొడుకు వివేకుకు చెబుతూ సత్యానంద్ కన్నుమూస్తాడు. ఈ విషయాన్ని టార్గెట్ గా తీసుకున్నటువంటి వివేక్ మానవ హక్కుల కమిషన్ కలిసి బాలరాజు కేస్ కోసం కొట్లాడుతాడు.. మరి బాలరాజు చెప్పినట్టు సత్యానంద్ నిర్దోషా.. అతను నేరం చేయలేదని న్యాయమూర్తి నమ్మడానికి అసలు కారణాలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.?
అనేక ట్విస్టులు:
కాండ్రకోట మిస్టరీ అనే శీర్షికపై హర్రర్ సినిమాలా మలిచాడు. ఒక అమ్మాయి మరణించడంతో ఆమెను చంపిన నేరం గురించి తెలియజెప్పే కథాంశం చుట్టే సినిమా తిరుగుతుంది తప్ప ఎలాంటి హర్రర్ ఎలిమెంట్స్ అయితే కనిపించవు. ముఖ్యంగా బాలరాజు హత్య చేశాడా లేదా అనే దాని గురించే హీరో కొట్లాడడం ఇందులో ప్రధాన అంశం. ఇందులో డైరెక్టర్ కాస్త స్టోరీని వెరైటీగా మలిచి ఆసక్తి నెలకొల్పే ప్రయత్నం చేశాడు కానీ పూర్తిగా ప్రేక్షకులను కథలోకి వెళ్లి ఇన్వాల్వ్మెంట్ అయ్యేలా చేయలేకపోయాడు.
అద్భుత ట్విస్ట్ లు:
ఇక రెండో భాగంలో కాస్త కీలకమైన పాత్రలు అయినటువంటి బాలరాజు అతని కుమార్తె సుధా, మంజుల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు అందరిని ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా తండ్రీ కూతుర్ల అనుబంధం మంజు ప్రేమకథను చెబుతూ పల్లె వాతావరణాన్ని అద్భుతంగా మలిచాడు. ఇందులో బాలరాజు మంజూను హత్య చేశాడేమో అని ప్రేక్షకుడి ఫీలయ్యేలా కొన్ని సన్నివేశాలు చూపించారు. ఇక నటీనటులంతా ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు చేశారు. ఇందులో పాటలు ఉన్న అవి పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తానికి దర్శకుడు రాజేష్ వాస్తవ సంఘటనల ఆధారంతో కథను రాసుకొని ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడని చెప్పవచ్చు.
నటీనటుల పనితీరు:
ఇందులో తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకుగా వరుణ్ సందేశ్ ను హైలెట్ చేసి చూపించారు. ఇందులో వరుణ్ సందేశ్ కూడా అద్భుతంగా నటించాడని చెప్పవచ్చు. సీనియర్ నటులు అయినటువంటి చత్రపతి శేఖర్, తనికెళ్ల భరణి, యాని వారి వారి పాత్రల్లో అందరినీ మెప్పించారు.
బలాలు:
ఫ్లాష్ బ్యాక్
సెకండాఫ్ లో అనేక ట్విస్టులు.
బలహీనతలు:
కథ తెలిసినట్టే ఉండడం
సాగదీత సన్నివేశాలు
చివరగా:
ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓ మోస్తారుగా పర్వాలేదు అనిపించుకుంటుంది.