ఏపీకి రూ.15 వేల కోట్లు కేటాయించామని అన్నారు. అంతేకాకుండా అమరావతి ఏర్పాటు కోసం కూడా అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయిస్తామని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్లమెంట్ లో మాట్లాడిన ఆమె.. దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజు వృద్ధి చెందుతోందని అన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా పథకాలు, రైతుల కోసం ఇటీవల అన్ని పంటల మద్దతు ధరలు పెంచామని అన్నారు.
విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని, 400 జిల్లాల్లో దాన్ని అమలు చేశామన్నారు. మూడు స్కీంల ద్వారా ఉద్యోగ కల్పన చేస్తున్నామని తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె తెలిపారు. ఏపీ విభజన చట్టానికి కూడా కట్టుబడి ఉన్నామని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఏపీకి రూ.15 వేల కోట్లు కేటాయించామని అన్నారు. అంతేకాకుండా అమరావతి ఏర్పాటు కోసం కూడా అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయిస్తామని అన్నారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని అన్నారు.