Ola Scooter: ఓలాపై విరక్తి! భరించలేక కస్టమర్ ఏం చేశాడంటే

మరో ఓలా కస్టమర్ ఓ కొత్త రకం ..నిరసనను తెలిపాడు. ఏడాదిగా విసిగి వేసారిన ఆ కస్టమర్ ఓలా స్కూటర్ ను రిక్షా ఎక్కించి, ఓలా షోరూం వద్ద నిలబడి ఓ పేరడీ పాట పాడుతూ నిరసన తెలిపాడు


Published Aug 23, 2024 08:36:00 PM
postImages/2024-08-23/1724425841_OlaElectricScooterOwnerSingsSonginProtestatShowroom.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: స్కూటర్లు ఇప్పుడు జనాలు ఎలక్ట్రిక్ స్కూటర్స్  హవానే నడుస్తుంది. అయితే ఓలా బైక్ పై విరక్తి వచ్చి  ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా .. సర్వీస్ సక్రమంగా చేయడం లేదని, కంపెనీ నుంచి స్పందన సరిగ్గా ఉండటం లేదని ప్రొటెస్ట్ చేసిన విషయాలు కోకొల్లలు.


ఓలా యాజమాన్యం మారడం లేదు. ఎన్ని కంప్లెయింట్లు ఇచ్చినా .. యాజమాన్యం మారడం లేదని అంటున్నారు.ఇప్పుడు మరో ఓలా కస్టమర్ ఓ కొత్త రకం ..నిరసనను తెలిపాడు. ఏడాదిగా విసిగి వేసారిన ఆ కస్టమర్ ఓలా స్కూటర్ ను రిక్షా ఎక్కించి, ఓలా షోరూం వద్ద నిలబడి ఓ పేరడీ పాట పాడుతూ నిరసన తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.


సాగర్ సింగ్ అనే వ్యక్తి పాడైపోయి కదలకుండా ఉన్న ఓలా స్కూటర్ ను రిక్షా తీసుకొచ్చి ఓలా షోరూం వద్ద ఉంచి, బాలీవుడ్ పాట, ‘తడప్ తడప్’ సాంగ్ కు పేరడీగా ‘టూట్ గయే హమ్ ఓలా లేకర్ కే’అని పాడాడు. మైక్ , స్పీకర్లు అబ్బో నానా హంగామా చేశారు. ఇలా చెయ్యడంతో జనాలు గుమిగూడారు. వారందరికి ఓలా చేతిలో మోసపోకండి అంటూ ..పాటలు పాడాడు.ఈ సంఘటన ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియనప్పటికీ సోమవారం(ఆగస్టు 19) సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhilai.sahar (@bhilai.sahar)

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu viral-news

Related Articles