Hyderabad: మీడియాపై మరోసారి పోలీసుల జులుం

ప్రజాపాలన అంటే పోలీస్ పాలన వచ్చిందంటూ మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నాకు వస్తే ఉద్రికత్తంగా మార్చి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Published Jul 08, 2024 07:47:16 AM
postImages/2024-07-08/1720428836_Screenshot20240708142022.jpg

న్యూస్ లైన్ డెస్క్: సోమవారం డీఎస్సీ అభ్యర్ధులు విద్యాశాఖ కార్యాలయం ముట్టడించి ఆందోళనలు చేశారు. డీఎస్సీ ఎగ్జామ్‌ను మూడు నెలలు వాయిదా వేయాలంటూ ధర్నాకు దిగారు. విద్యాశాఖ ముందు ఆందోళనకు వస్తున్న అభ్యర్ధులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చినవారిని వచ్చినట్లుగా వ్యాన్లలో అరెస్ట్ చేశారు. దీంతో విద్యార్దులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజాపాలన అంటే పోలీస్ పాలన వచ్చిందంటూ మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నాకు వస్తే ఉద్రికత్తంగా మార్చి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

టెట్ ఎగ్జామ్ నిర్వహించిన 15 రోజుల్లోనే డీఎస్సీ ఎగ్జామ్ అంటే ఎలా అంటూ ప్రశ్నించారు. చదువుకునేందుకు సమయం ఇవ్వరా అంటూ నిలదీశారు. ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్ధుల గోసను పట్టించుకోవాలంటూ అభ్యర్ధులు డిమాండ్ చేశారు. 

మరోవైపు మీడియాపైనా పోలీసులు జులుం చూపించారు. విద్యార్ధుల ధర్నా కవరేజ్ కోసం వెళ్లినవారిని సైతం అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించిన వారిని తోసేసే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులతో పోలీసులు గొడవకు దిగారు.

newsline-whatsapp-channel
Tags : india-people newslinetelugu tspolitics telanganam police dsc unemployed social-media

Related Articles