ఆర్కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సత్ శీలంతో వ్యక్తిత్వం మరింత వికసిస్తుంది. ఒక మనిషి సర్వోన్నతంగా జీవించడం 'వ్యక్తిత్వ వికాసం'తోనే సాధ్యమవుతుంది. దీనిపై హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని 'వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్' ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. వ్యక్తిత్వ వికాస సర్టిఫికేట్ కోర్సును ప్రవేశపెట్టిన ఆర్కే మఠ్.. ఈ నెల 4 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు క్లాసులు ఏర్పాటు చేసింది.
కేవలం ఆదివారాల్లో మాత్రమే జరిగే ఈ క్లాసులు మొత్తంగా ఆరు ఆదివారాలు ఉండనున్నాయి. ఉదయం 6.45 నుంచి 9.00 వరకు జరుగుతాయి. స్వామి వివేకానంద బోధనల ఆధారంగా వ్యక్తిత్వం అంటే ఏమిటి? ఎందుకు?, ఆరోగ్యకరమైన మనస్సు, శరీరం.. లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడం, సమయపాలన, వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేయడం అనే అంశాలపై ఈ క్లాసులు జరుగుతాయి. 17 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వారు మాత్రమే దీనికి అర్హులు.
ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం https://rkmath.org/vihe/లోకి వెళ్లి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.