తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత ఇంటి బాధ్యతలు మొత్తం తల్లిపైనే పడ్డాయి. వారికి ఒక కూతురు ఉంది. చేసిన కష్టం సరిపోక..
న్యూస్ లైన్ డెస్క్ : దేశం అభివృద్ధి చెందుతోంది. దూసుకుపోతోంది అనే కేంద్రప్రభుత్వ మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రజా పాలన అంటూ గప్పాలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ సైతం ఆ పేద కుటుంబానికి ఎలాంటి బాసట ఇవ్వలేదు. అప్పుల బాధ తట్టుకోలేక తల్లి కన్నుమూస్తే.. అంత్య్రియల కోసం భిక్షాటన చేసింది ఓ బాలిక. కనీసం ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే గానీ, అధికార పార్టీ నాయకులు గానీ, అధికారులు గానీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
హృదయవిదారక ఘటన
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడాలో గ్రామంలో తల్లి అంత్యక్రియల కోసం సాయం చేయాలంటూ కూతురు భిక్షాటన.
గతంలో అనారోగ్యంతో తండ్రి మృతి.. ఆర్ధిక ఇబ్బందులకు తాళలేక ఉరివేసుకుని తల్లి ఆత్మహత్య. pic.twitter.com/CxeEweY6XA — Telugu Scribe (@TeluguScribe) August 18, 2024
ఈ హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడా గ్రామంలో జరిగింది. కొంతకాలం క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత ఇంటి బాధ్యతలు మొత్తం తల్లిపైనే పడ్డాయి. వారికి ఒక కూతురు ఉంది. చేసిన కష్టం సరిపోక.. అప్పులు తీర్చలేక.. నిత్యం వేధించే అప్పుల వాళ్ల మాటలు పడలేక తల్లి ఆత్మహత్య చేసుకోగా బాలిక అనాధగా మారింది. తల్లి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక వాకిట్లో తల్లి శవాన్ని పెట్టుకొని భిక్షాటన చేసింది. ఈ దృశ్యం చూసేవారికి కంటతడి పెట్టిస్తోంది.