1:50 రేషియోలో గ్రూప్-1 మెయిన్స్కి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ప్రిలిమ్స్ రిజల్ట్స్ తీవ్ర దుమారాన్ని రేపే ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తిర్ణులై మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఫలితాలతో పాటే ఫైనల్ కీని వెబ్సైట్లో ఉంచారు.
అయితే, 1:100 రేషియోలో తమను క్వాలిఫై చేయాలని గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు విడుదలయ్యాయి. కానీ, 1:50 రేషియోలో గ్రూప్-1 మెయిన్స్కి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ప్రిలిమ్స్ రిజల్ట్స్ తీవ్ర దుమారాన్ని రేపే ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించగా.. మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు వారం రోజుల ముందు నుండి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in/క్లిక్ చేయండి.