కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు మోడీ పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈసారి బడ్జెట్‌లో కొన్ని కీలక అంశాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నిర్మల సీతారామన్ ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. 2024-25 బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్రపతికి నిర్మలా సీతారామన్ సమాచారమిచ్చారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళవారం తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆమె కూడా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతుండడం గమనార్హం.
లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నిర్మల సీతారామన్ ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుండి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. 2024-25 బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్రపతికి నిర్మలా సీతారామన్ సమాచారమిచ్చారు. మరికాసేపట్లోనే కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.
కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు మోడీ పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈసారి బడ్జెట్‌లో కొన్ని కీలక అంశాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది బడ్జెట్‌లో తెలంగాణకు రూ.4,418 కోట్లే కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి రాష్ట్రం నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండటంతో బడ్జెట్ కేటాయింపులపై భారీ అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర పడింది. కాసేపట్లో లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.కాగా, ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్ విడుదల కానుంది. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉండనుందని ఇటీవల మోడీ చెప్పిన విషయం తెలిసిందే.