Alert: రాష్ట్రానికి వాన గండం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 9 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మరో 12 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌,  12 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. 


Published Sep 01, 2024 01:29:01 PM
postImages/2024-09-01/1725177541_redalert.jpg

న్యూస్ లైన్, హైదరాబాద్: రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 24గంటలుగా ఎడతెరపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 9 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మరో 12 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌,  12 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. 

ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మేడ్చల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఎల్లుండి ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam rains weather-report weather-update weather-forecast

Related Articles