క్షాబంధన్ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. రాఖీ పర్వదినాన చెల్లి తన తమ్ముడికి లేదా అన్నకి ఎంతో ప్రేమగా రాఖీ కడితే, అన్నయ్య ఆ ఆడబిడ్డకి ఏవైనా బహుమతులు ఇస్తారు. అలాంటి రాఖీ పండుగ ఆగస్టు 19వ తేదీన
న్యూస్ లైన్ డెస్క్: రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. రాఖీ పర్వదినాన చెల్లి తన తమ్ముడికి లేదా అన్నకి ఎంతో ప్రేమగా రాఖీ కడితే, అన్నయ్య ఆ ఆడబిడ్డకి ఏవైనా బహుమతులు ఇస్తారు. అలాంటి రాఖీ పండుగ ఆగస్టు 19వ తేదీన జరుగుతుండడంతో మార్కెట్ లో రాఖీల కొనుగోలు జోరుగా సాగుతోంది. ఏ టైంలో రాఖీ కడితే మంచిది, దివ్యమైన ముహూర్తం ఎప్పుడు ఉంది అనే వివరాలు చూద్దాం.
తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన సోమవారం రాఖీ పండుగ జరుపుకొనున్నారు. సోమవారం ఉదయం శ్రావణ మాస శుక్లపక్షం పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:4 నిమిషాలకు ప్రారంభమై అదే రోజు రాత్రి 11:55 నిమిషాలకు ముగుస్తుందట.
సోమవారం ఉదయం 5.53 ప్రారంభమై మధ్యాహ్నం 1.32 నిమిషాల వరకు భద్రకాలం ఉండడంతో, ఆ టైంలో రాఖీ కట్టకూడదని అంటున్నారు. ఈ కాలం ముగిశాక మధ్యాహ్నం 1:35 రాత్రి 9:8 నిమిషాల మధ్య రాఖీ కట్టడానికి శుభ సమయం అంటున్నారు.
అంతేకాకుండా మధ్యాహ్నం 1.35 నుంచి 3.39 దివ్యమైన ముహూర్తం ఉందని ఈ సమయంలో రాఖీ కడితే మరింత మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి రాఖీ కట్టే టైంలో తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మరింత మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.