Revanth reddy: దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డాం

గత 70 ఏళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతోఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని రేవంత్ అన్నారు.ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుందని వెల్లడించారు.


Published Sep 07, 2024 01:50:07 PM
postImages/2024-09-07/1725697207_newslinetelugu21.jpg

న్యూస్ లైన్ డెస్క్: అందరి పూజలు, దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఖైరతాబాద్ గణేశ్ పూజలో పాల్గొన్న అయన.. పూజ అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని అన్నారు. గత 70 ఏళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతోఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని రేవంత్ అన్నారు.ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుందని వెల్లడించారు.

ఈసారి హైదరాబాద్‌లో లక్షా 40 వేల విగ్రహాలను ప్రతిష్టించారని రేవంత్ అన్నారు. గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిందని వెల్లడించారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని తెలిపారు. స్వర్గీయ పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నా అని రేవంత్ అన్నారు. ప్రతీ ఏటా ఉత్సవ కమిటీ ఎప్పుడు ఆహ్వానించినా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానని తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : india-people news-line newslinetelugu telanganam cm-revanth-reddy vinayakachavithi vinayaka-chavithi

Related Articles