Revanth Reddy: పరీక్ష రాయనోళ్లే దీక్షలు చేస్తున్నరు

మరో వ్యక్తి ఇదివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు. ఇప్పడు ఏ పరీక్ష రాస్తున్నాడని అడిగితే.. పార్టీలో ఏ ఉద్యోగం ఇవ్వలేదని,  తనను కదిలించడానికే దీక్షకు కూర్చున్నాడు అని చెప్పారని రేవంత్ తెలిపారు. తనకు తెలిసిన మరో యువకుడు గాంధీ హాస్పిటల్ లో చేరి ఆమరణ నిరాహార దీక్షకు కుర్చున్నాడని, అవసరమైతే స్పెషల్ కోచింగ్ ఇప్పిద్దామని అడిగితే..  ఏం పరీక్ష రాయట్లేదు. ఒక లీడర్ చెప్పిండు అంట చేస్తే పేరు వస్తదని అందుకు చేశాడంట అని చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. 
 
Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-13/1720874386_dakgjfaskglhllash.jpg

న్యూస్ లైన్ డెస్క్: డీఎస్సీ పరీక్ష వాయిదా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కామెంట్ చేశారు. డీఎస్సీని వాయిదా వేయాలని ముగ్గురు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. వారిలో ఒక్కరు కూడా పరీక్ష రాసే అభ్యర్థులు లేరని రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్‌పై నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్సీ అంశంపై స్పందించారు. 

కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నాడు. ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడని అడిగితే.. ఆయనకి కోచింగ్ సెంటర్ ఉంది. రెండు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే రూ.100 కోట్లు లాభం వస్తుందని చెప్తున్నారని రేవంత్ వెల్లడించారు. 

మరో వ్యక్తి ఇదివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు. ఇప్పడు ఏ పరీక్ష రాస్తున్నాడని అడిగితే.. పార్టీలో ఏ ఉద్యోగం ఇవ్వలేదని,  తనను కదిలించడానికే దీక్షకు కూర్చున్నాడు అని చెప్పారని రేవంత్ తెలిపారు. తనకు తెలిసిన మరో యువకుడు గాంధీ హాస్పిటల్ లో చేరి ఆమరణ నిరాహార దీక్షకు కుర్చున్నాడని, అవసరమైతే స్పెషల్ కోచింగ్ ఇప్పిద్దామని అడిగితే..  ఏం పరీక్ష రాయట్లేదు. ఒక లీడర్ చెప్పిండు అంట చేస్తే పేరు వస్తదని అందుకు చేశాడంట అని చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. 

ఇక గతంలో నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీ అశోక్ నగర్‌లో తిప్పినప్పుడు ఆయన ఏం పరీక్ష రాశారని సీఎం మాటలు విన్న పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, డీఎస్సీలో అదనంగా 30 వేల పోస్టులు ఉన్నాయని గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి తెలిపారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 11 వేల ఉద్యోగాలతోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న డీఎస్సీని రద్దు చేసి మెగా డీఎస్సీ వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ సర్కార్ దిగి రాకపోగా.. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : revanth-reddy newslinetelugu telanganam congress-government dsc tgspsc unemployed

Related Articles